టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) ??

ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని, కొత్త విద్యావిధానం అమలుతో ఒక్క స్కూల్ కూడా మూతపడదని, ఏ టీచర్ పోస్టు కూడా తగ్గదని వెల్లడించారు. నూతన విద్యా విధానం అమలుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. నూతన విద్యావిధానంపై ప్రతిపాదనలు వారం రోజుల్లో ఖరారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆన్‌లైన్‌ విద్యాబోధనకు రెండు వర్సిటీలను ఎంపిక చేశామన్నారు. విద్యాదీవెన పథకంలో భాగంగా రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని ఐచ్ఛికంగా కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •