వార్తలు (News)

ఉద్రిక్తతల మధ్య నర్సుల ఆందోళన??

హైదరాబాద్ గాంధీభవన్‌ వద్ద నర్సులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన నర్సులు.. ఆ తర్వాత అక్కడ నుంచి కోఠి డీఎంఈ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లేందుకు యత్నించడంతో నర్సులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. తొలగించిన నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకొని జీతాలు చెల్లించాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో సేవ చేసిన వారిపై ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. 20 మంది నర్సులను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •