ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

వ్యాక్సిన్ ల సామర్థ్యంపై పరిశోధన??

దేశంలో ఇప్పటికే కరోనాకు పలు వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కరోనాను ఎదురుకునే సామర్థ్యాన్ని అంచనా వేసే పనిలో ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కువ రక్షణ లభిస్తుందని పరిశోధనలు జరుపుతున్నారు. ఫైజర్ మరియు మోడిర్నా వ్యాక్సిన్ పై కూడా ఈ ప్రయోగాలు జరిపి ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకే చాన్స్ 91% తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైనట్టు అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. వేసుకున్నాక రెండు వారాలకు 85% కరోనా బారిన పడే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా రెండో డోస్ వేసుకున్నాక రెండు వారాలకు 91% వ్యాధినిరోధకత ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అనారోగ్యంతో బెడ్ కు పరిమితం అయ్యే రోజులు 60 శాతం తగ్గాయని వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న 2.7 రోజుల్లోనే వైరస్ లో 70 శాతం వరకు తగ్గుతుందని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ఫైజర్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టమైన సంగతి పాఠకులకు తెలిసిందే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •