వార్తలు (News)

అనకాపల్లి వంతెన కూలడానికి కారణం??

విశాఖ జిల్లా అనకాపల్లి బైపాస్‌ వద్ద వంతెన కూలిన ఘటన పాఠకులకు తెలిసిందే! ఈ ఘటనపై జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారికంగా స్పందిస్తూ ”ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించాం. ఘటనకు సంబంధించి ముఖ్య వ్యక్తులను సస్పెండ్‌ చేశాం. ఇద్దరు ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్లతో ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం.

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సరిపడా యాంకరేజ్‌ లేనందునే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధరణ. సరైన వుడెన్‌ సపోర్ట్‌ బేరింగ్‌ లేకపోవడం మరో కారణం” అని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా నిబందనలు పాటించాలని ఆదేశించినట్టు చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ జీఎం విడుదల చేసిన ప్రకటనలో బాధితులకు పరిహారం గానీ, క్షతగాత్రులకు వైద్య సహాయం అంశాలను మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •