ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

గంగానదిలో కరోనా ఆనవాళ్లు లేవు..!!

గత కొంతకాలంగా కరోనా మృతదేహాలను గంగానదిలో విడిచి వెళ్లిన ఘటనలు చాలానే చూసాము. అయితే నదిలో వైరస్‌ ఆనవాళ్లు ఎక్కడా లభించలేదని, గంగానది కరోనారహితమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం విశేషం!

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లోని గంగానదిలో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలు కొట్టుకురావడం, పలు చోట్ల గంగానది ఒడ్డున అనేక మృతదేహాలను పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి రావడంతో నదిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఉండొచ్చనే అభిప్రాయంతో శాస్త్రవేత్తలు గంగానది నీటిపై పరిశోధనలు నిర్వహించి వైరస్‌ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు.

శాస్త్రవేత్తలు, జన్యు నిపుణులు కూడా రెండు నెలలపాటు గంగానదిలో వైరస్‌ ఆనవాళ్లపై పరిశోధనలు చేశారు. ‘‘మా బృందం అనేక నమూనాలను సేకరించి ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేసింది. వాటిలో పాజిటివ్‌గా నిర్థరణ అయినవి ఉన్నాయి… నెగటీవ్‌ వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ, గంగానది నుంచి సేకరించిన నమూనాల్లో మాత్రం వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ కనిపించలేదు’’అని బీఎస్‌ఐపీ శాస్త్రవేత్త నీరజ్‌ రాయ్‌ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    11
    Shares
  • 11
  •  
  •  
  •  
  •