వార్తలు (News)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మాప్ సిద్ధం!!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం రోడ్ మాప్ సిద్ధం చేసింది. ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్లని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రజలు చేస్తున్న ఉద్యమాలను, అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుని టెండర్లను ఆహ్వానిస్తూ జులై 7 వ తేదీ నుంచి బిడ్డింగ్ కూడా ప్రారంభించింది.
ప్రి బిడ్ మీటింగ్ 15 న, బిడ్ సబ్మిషన్ లాస్ట్ డేట్ 28 వ తేదీ, 29 న టెక్నికల్ బిడ్‌లను ప్రకటించింది. ఎంపికైన కంపెనీ కి వెంటనే స్టీల్ ప్లాంట్ ని అప్పగించనుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ఈ ప్రకటనలో కేంద్రం పేర్కొంది.

ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి కేంద్రం పెట్టింది. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •