వార్తలు (News)

కేరళలో వ్యాప్తి చెందుతున్న జికా వైరస్??

తిరువనంతపురంలో 19 నమూనాలు ల్యాబ్ కి వెళ్లగా వైద్యులు సహా 13మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్ సోకి ఉంటుందని వైరాలజీ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా.. కేరళ రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు వెలుగు చూసింది. 24ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.

ఇప్పటికే పాజిటివ్ గా నిర్థారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. జ్వరం, తలనొప్పి, చర్మం ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్ 28న ఆస్పత్రిలో చేరారు. జికా వైరస్ లక్షణాలు కూడా డెంకీ జ్వరం లానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •