అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఏడేళ్ల తర్వాత నైజీరియన్ల చెర నుండి ఇంటికి చేరిన యువతి!!

నైజీరియాలో పాఠశాలలపై దాడి చేసి విద్యార్థినీ విద్యార్థులను కిడ్నాప్ చేయడం అనేది సాధారణమైపోయింది.అసలేం జరిగిందంటే.. 2014లో బొకో హరం తీవ్రవాదులు బోర్నో రాష్ట్రంలోని చిబోక్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలపై దాడి చేసి 270 మందికిపైగా విద్యార్థినులను కిడ్నాప్‌ చేసారు. అప్పుడు కిడ్నాప్ అయిన ఒక యువతిని ఇప్పుడు విడుదల చేయడంతో మళ్ళీ ఆ సంఘటన తెర పైకి వచ్చింది. ఆమె పేరు రూత్ గ్లాడర్ పోగు. ఏడేళ్ల తర్వాత ఆమె తిరిగి తన కుటుంబం చెంతకు చేరారు.

కిడ్నాపైన 100 మందికిపైగా అమ్మాయిలలో కొంతమంది తప్పించుకోగా, మరి కొంత మందిని వివిధ సందర్భాలలో విడుదల చేశారు. మిగిలిన వారు మాత్రం అక్కడే ఉండిపోయారు. కిడ్నాప్ తర్వాత మిలిటెంట్లలోని ఒక వ్యక్తి రూత్ గ్లాడర్ పోగును పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఇటీవల నైజీరియా సైన్యానికి లొంగిపోయాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •