టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

1.5 కిలోమీటర్లు.. గోల్నాక వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం ??

రాజధాని నుంచి వరంగల్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వెళ్లాలంటే జాతీయ రహదారి 202
అత్యంత కీలకమైనది. కోఠి, ఛాదర్‌ఘాట్‌, గోల్నాక, ఛేనంబర్‌ చౌరాస్తా, అంబర్‌పేట్‌, శ్రీరామ్‌నగర్‌ చౌరస్తా, రామంతాపూర్‌, ఉప్పల్‌ మీదుగా వరంగల్‌కు వెళ్లేందుకు 202 నెంబర్‌ జాతీయ రహదారి ఉపయోగిస్తారు. ఛేనంబర్‌ చౌరస్తా-అంబర్‌పేట్‌ శ్రీరామ్‌నగర్‌ చౌరస్తా మధ్య రోడ్డుకు రెండువైపులా శ్మశానాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ రోడ్డు చాలా వరకు కుంచించుకుపోయింది. గత పదేళ్లుగా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈనేపథ్యంలో గోల్నాక నుంచి శ్రీరామ్‌నగర్‌ చౌరస్తా దాటి ముఖరం హోటల్‌ వరకు 1.5 కిలోమీటర్ల పొడవున ఆకాశమార్గం నిర్మించాలని, మూడేళ్ల కిందట దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలను పంపిస్తే కేంద్ర రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మించడానికి అంగీకరించింది.

కానీ భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించాలని రాష్ట్రానికి కేంద్రం షరతు విధించగా రాష్ట్రం దానికి అంగీకరించడంతో ఈ ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేసింది. 1.5 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల వంతెన నిర్మాణం జరగనుంది. వంతెన నిర్మాణానికి రూ.275 కోట్ల వ్యయం అవుతుంది. భూసేకరణ కోసం రూ.150 కోట్లను వ్యయం చేశారు. ఇందులో కొంత భాగం జీహెచ్‌ఎంసీ భరించింది. ఈ భూసేకరణ ఆలస్యం జరగడం వల్లే ఏడాదిగా పనులు మొదలుకాలేదు.

ఇటీవలే బల్దియా అధికారులు భూసేకరణ పూర్తి చేయడంతో మరో నెల రోజుల్లో మొదలు పెట్టనున్నారు. ఈ వంతెన నిర్మాణం వల్ల ఉప్పల్‌ మీదుగా వరంగల్‌ వైపు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •