టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఇండియన్ బెర్ముడా సరస్సు ఎక్కడ ఉందొ మీకు తెలుసా??

భారత దేశం ఒక పెద్ద టూరిజం స్పాట్ గా పిలుస్తారు. పర్వతాలు, అడవులు, లోయలు, సరస్సులు, అలనాటి రాజులు నిర్మించిన కోటలవంటి టూరిజం కేంద్రాలకు ప్రసిద్ధమైన దేశంగా కూడా భారత దేశాన్ని వర్ణిస్తారు. వీటిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అలాగే అంతులేని రహస్యాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. ఎవరూ తేల్చని మిస్టరీ లేక్ ఒకటి భారత దేశం లో ఉంది. అక్కడికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదని చాలా మంది చెప్పుకుంటారు.

భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని అలాంటి ఒక సరస్సు ఉంది. దీనిని ‘లేక్ ఆఫ్ నో రిటర్న్’ అని పిలుస్తారు. కొన్ని రహస్య సంఘటనల కారణంగా ఈ సరస్సు ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైంది. ఈ రోజు వరకు ఈ సరస్సు దగ్గరకు ఎవరు వెళ్లినా వారు తిరిగి రాలేదు.

ఈ సరస్సు వెనుక ఓ పెద్ద కథ ప్రచారంలో ఉంది. ఈ రహస్య సరస్సు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్లు ఇది ఓ చదునైన మైదానంలా ఊహించుకుని ఇక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని.. కానీ ఆ తర్వాత అది పైలట్‌లతో పాటు అదృశ్యమైందని చెబుతారు. సరిగ్గా ఇదే ప్రదేశంలో మరో ఘటన చోటు చేసుకుంది. అతడిని వెతికేందుకు ఈ సరస్సులోకి దిగిన అమెరికన్ సైనికులు కూడా తిరిగి రాలేదు.

ఇంకా ఈ సరస్సుకి సంబంధించిన మరొక కథ కూడా ప్రచారం లో ఉంది. దీని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొందరు జపనీస్ సైనికులు ఈ సరస్సులోకి దిగి ఆ తర్వాత ఆ సైనికులు కూడా తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఇందులోకి దిగేందుకు ఎవరూ సహాసం చేయడం లేదు. ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో ఈ సరస్సుపై సినిమాలు, స్టోరీలు చాలా వచ్చాయి. అందుకే ఈ సరస్సును Mystery of Indian Bermuda అని.. Lake of No Return అని పిలుస్తున్నారు. అయితే ఈ సరస్సును చూసేందుకు చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. కాని సరస్సులోకి మాత్రం దిగకుండా దూరంగా చూసి వెళ్లి పోతారు. మీరు కూడా మిస్టరీ లు ఇష్టపడితే ఒకసారి వెళ్లి చూసి వచ్చేయండి..!!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •