జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

రేషన్‌ డిపో వద్ద ప్రధాని ఫొటో పెట్టాలని తెలియదా??

కేంద్రం ‘గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ పథకం కింద బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందన్న సమాచారం ప్రజలకు తెలియాలి కదా.. రేషన్‌ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫొటో ఎందుకు ఉంచలేదు? అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌… అధికారులు, రేషన్‌ డీలర్‌పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేట రేషన్‌ డిపోను ఆదివారం తనిఖీ చేస్తున్న సమయంలో డీలర్‌ కేఎల్వీ మహేశ్వరితో మాట్లాడగా మే, జూన్‌ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ మొబైల్‌ వాహనం ద్వారా బియ్యం అందించారని, జూలై నుంచి రేషన్‌ షాపువద్ద ఇస్తున్నామని డీలర్‌ వివరించారు.

మే, జూన్‌లో ప్రధాని ఫొటో లేకుండానే బియ్యం పంపిణీ చేయడమేంటని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ వాహనం ద్వారా నేరుగా ఇంటికే బియ్యం సరఫరా చేస్తోదని జేసీ వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ వివరించే ప్రయత్నం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం సంగతి ఇపుడెందుకంటూ ఆమె మండిపడ్డారు. మే నుంచి నవంబరు వరకు పేదలకు ఉచితంగా బియ్యం లేదా గోధుమలు అందజేయాలని కేంద్రం నిర్ణయించిందని, ఈ విషయం కార్డుదారులకు తెలుసా? అని తీవ్రంగా స్పందించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •