అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

యూఏఈ ప్రకటనతో అయోమయంలో పడిన ప్రవాసులు!

అత్యవసర పనుల కోసం స్వదేశానికి వెళ్లి, అక్కడే చిక్కుకుపోయిన నివాసితులు యూఏఈకి తిరిగి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన పాఠకులకు విదితమే! కానీ ఆన్‌లైన్ విధానంలో ముందస్తు అనుమతి, వాక్సిన్ సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌తోపాటు ప్రయాణానికి 48 గంటల ముందు ముందు క్యూఆర్ స్కాన్ కోడ్ కల్గిన పీసీఆర్ టెస్ట్ నివేదిక అనే మూడు నియమాలు పూర్తి చేసిన వారు తమ దేశంలోని ప్రవేశించవచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించగా.. దుబాయిలోకి ప్రవేశానికి దుబాయి వీసా మాత్రమే, యూఏఈ వాక్సిన్ మరియు క్వారంటైన్ అనే మూడు కీలకంశాలపై సరైన సమాచారం కోసం ప్రవాసీయులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

యూఏఈలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని స్వదేశానికి వెళ్లిన వారిని మాత్రమే తిరిగి రానిస్తుండడంతో అనేక మంది ఆశలు అడియాసలవుతున్నాయి. గతంలో సౌదీ అరేబియాలో కూడ ఇదే విధానాన్ని అమలు చేసింది. దీంతో భారతీయ వాక్సిన్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడంలో ప్రవాసులు ఇబ్బందులు పడి తర్వాత న్యూ ఢిల్లీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం ద్వారా అటెస్ట్ చేయించి అప్‌లోడ్ చేశారు. అనంతరం ఎటువంటి అటెస్టేషన్ లేకుండానే భారతీయ సర్టిఫికెట్లను సౌదీ ఆమోదించింది. ఇప్పుడు యూఏఈ విషయంలో కూడా అదే జరుగుతోంది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ల గుర్తింపు అంశంపై ఇరు దేశాల మధ్య ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

యూఏఈ ప్రకటన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు దుబాయి విమానాశ్రయానికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే కేవలం దుబాయి ఎమిరేట్ రెసిడెన్సీ వీసా కలిగిన వారిని మాత్రమే అధికారులు అనుమతిస్తుండటం, ఇతర ఎమిరేట్ల వీసాలు కలిగిన వారిని అడ్డుకుంటుండటంతో గత రెండు రోజులుగా పెద్ద గందరగోళం నెలకొనింది. శుక్ర, శనివారాల్లో అబుధాబి, ఇతర ఎమిరేట్ల వీసాలు కలిగిన తెలుగు ప్రవాసులకు అధికారులు దుబాయిలోకి అనుమతి నిరాకరించారు. శనివారం ముంబాయి విమానశ్రాయంలో 40 మంది దుబాయేతర వీసాలు కల్గిన ప్రవాసులు దుబాయి విమానంలోకి ఎక్కేందుకు అనుమతి లభించలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •