టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

టైం పాస్ కోసం రాస్తే.. జేఈఈ ఎగ్జామ్ లో 100 పర్సంటైల్..!!

ఇంటర్​ పూర్తి చేసుకున్న ప్రతి ఎంపీసీ విద్యార్థికి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్​డ్ పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ కాలేజీల్లో ప్రవేశం పొందాలంటే ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్​ స్కూళ్లు, కాలేజీలు ఐదు, ఆరో తరగతుల నుంచే ఐఐటీ గ్యారెంటీ అంటూ కోర్సులను ఆఫర్​ చేస్తున్నాయి. విద్యార్థులంతా తమ ఇష్టాలు మానుకొని, స్నేహితులకూ సమయం ఇవ్వకుండా పగలూ, రాత్రుళ్లు చదువుతూ ఉంటారు.

100 పర్సంటైల్​ సాధించిన 17 మంది విద్యార్థులలో ప్రవార్​​ కటారియా ఒకరు. కానీ, ప్రవార్​​ మాత్రం పరీక్ష బోర్​ కట్టి రాసాడు. ప్రవార్​​ ఢిల్లీలో నివాసం ఉంటాడు. ఇంటర్​ పాసయ్యాక అందరిలాగే తనుకూడా ఐఐటీలో సీటు కోసం చదివాడు. జేఈఈ మెయిన్స్​ కోసం కోచింగ్​ తీసుకొని మెదటి సెషన్​లోనే 100 పర్సంటైల్​ సాధించాడు. అయితే కరోనా సమయంలో బోర్​ కొట్టేసింది. అంతే మళ్లీ సెషన్​ 3 జేఈఈ మెయిన్స్​కి దరఖాస్తు చేసుకున్నాడు. అలా వెళ్లి ఇలా రాసి వచ్చాడు. మళ్లీ 100 పర్సంటైల్ తెచ్చుకుని ఔరా అనిపించుకున్నాడు. దీనిపై ప్రవార్​ స్పందిస్తూ.. ”తొలిదశలోనే 100 పర్సంటైల్​ మార్కులు వచ్చినా కరోనా టైంలో బాగా బోర్​ కొట్టింది. అందుకే థర్డ్​ ఫేజ్​లోనూ ఎగ్జామ్​ రాశా’ అన్నాడు. ఐఐటీ బాంబేలో బీటెక్​ చేయాలనేది తన కల అంటున్నాడు. కంప్యూటర్​ సైన్స్​ ఇంజనీరింగ్​ చేస్తానని, ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్​ సైన్స్​కు భవిష్యత్తు ఎక్కువగా ఉందని, తనకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్​ అంటే ఇష్టమని..ఫార్ములాలు, సిద్ధాంతాలపై మక్కువ ఎక్కువని తెలిపాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •