జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రికార్డును సృష్టించిన కియా మోటార్స్‌..?

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ సంస్థ కియా దేశీయ ఆటోమోటివ్‌ మార్కెట్‌లో 3 లక్షల కార్లను అమ్మినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల అమ్మకాల్లో అత్యంత వేగవంతమైన బ్రాండ్‌గా దక్షిణ కొరియా వాహన తయారీ కియా ఇండియా నిలిచింది. భారత మార్కెట్‌లోకి 2019 ఆగస్టులో కియా కార్ల అమ్మకాలను ప్రారంభించి దేశ వ్యాప్తంగా కియా 2020 జూలైలో మొదటి లక్ష కార్ల అమ్మకాలు జరుపగా, తదుపరి లక్ష కార్ల అమ్మకాలు జనవరి 2021లో సాధించి, 2021 ఆగస్టులో మొత్తంగా మూడు లక్షల కార్ల అమ్మకాలను కియా జరిపింది. కియా కార్ల అమ్మకాల్లో సెల్టోస్‌ 66 శాతం, తరువాతి స్థానంలో సోనెట్‌ 32 శాతం దేశీయ మార్కెట్‌లో స్థానాన్ని సంపాదించాయి. దేశవ్యాప్తంగా కియా కార్నివాల్‌ 7310 యూనిట్లను విక్రయించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •