వార్తలు (News)

కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో 12న అల్పపీడనం!!

కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ నెల 13 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు పడతాయని వెల్లడించారు. ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడడంతో దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని అన్నారు. మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంపై పొడిగాలుల ప్రభావం ఎక్కువ ఉంది.

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ అల్పపీడనం బలహీనపడేవరకు పరిస్థితులు ఇదే మాదిరిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా సోమవారం నుంచి వాయవ్య దిశగా గాలులు నెమ్మదిగా రాష్ట్రంపైకి వీయనుండటంతో వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •