క్రైమ్ (Crime) వార్తలు (News)

పార్కింగ్ లో పెట్టిన ద్విచక్ర వాహనాలు మాయం??

పాత పాలమూరుకు చెందిన విశ్రాంత ఉద్యోగి మహమ్మద్‌ రహమతుల్లా గత నెల 15న తన ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్టాండ్‌ పార్కింగ్‌ వద్ద ఉంచి హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే అక్కడ వాహనం కనిపించలేదు. అలాగే జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ ప్రాంతంలో నివసిస్తున్న నవీన్‌కుమార్‌ గత నెల 13న రాత్రి తన ఇంటి ముందు పెట్టిన ద్విచక్ర వాహనం ఉదయం లేచేసరికి కనిపించకుండా పోయింది.

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు మాయం అవుతున్నాయి. ఇంటి ముందు, రహదారి పక్కన, ఆసుపత్రుల దగ్గర, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, సంతలు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలు, కళాశాలలలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్టిన వాహనాలను దొంగలు అపహరిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 50 ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఠాణాల్లో కేసులు నమోదు కాగా వాటిలో 36 వాహనాలను పోలీసులు పట్టుకొని యజమానులకు అప్పగించారు. కేసులు నమోదు కానివి ఎన్నో ఉన్నాయి.

అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే.. నిఘా కెమెరాలు లేకనే అంటారు వాహనాలు పోగొట్టుకున్నవాళ్ళు! ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణ పనులు కొనసాగుతుండటంతో సీసీ కెమెరాలు తొలగించగా అక్కడక్కడ ఉన్నవి కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో వాహనాల దొంగలను పట్టుకోవడం సమస్యగా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలు ఎక్కువగా పోతున్నాయి. ఒకటో పట్టణ పీఎస్‌ పరిధిలో మార్కెట్‌ రోడ్డు, రైతు బజారు, గడియారం కూడలి, వన్‌టౌన్‌ కూడలి, ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం, తదితర ప్రాంతాల్లో వాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు ఉన్నాయి. రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, తెలంగాణ కూడలి, రాజేంద్రనగర్‌, న్యూటౌన్‌, గ్రామీణ ఠాణా పరిధిలో ఎస్‌వీఎస్‌ ఆసుపత్రి, మర్లు, టీచర్స్‌ కాలనీ, క్రిస్టియన్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాహనాలు అపహరణకు గురవుతున్నాయి.

ద్విచక్ర వాహనాల చోరీలను నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే గజ్వేల్‌ పట్టణానికి చెందిన వాహనాన్ని ముగ్గురు వ్యక్తులు తస్కరించి మహబూబ్‌నగర్‌ పట్టణంలో తిరుగుతుండగా ఆ వాహనానికి ఈ-చలాన్‌ పడి ఆ చలాన్‌ ద్విచక్ర వాహన యజమానికి వెళ్లడంతో మహబూబ్‌నగర్‌ నుంచి చలాన్‌ వచ్చిందని వారు గజ్వేల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు తమను సంప్రదించడంతో సిబ్బంది అప్రమత్తమై వాహనాన్ని, దాన్ని దొంగిలించిన ముగ్గురు యువకులను పట్టుకొని గజ్వేల్‌ పోలీసులకు అప్పగించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •