టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఈఎస్‌ఐసీలో 237 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 237 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆగష్టు 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.esic.nic.in/recruitments వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 237 ఉద్యోగ ఖాళీలలో ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీలు 53 ఉన్నాయి.

మిగిలిన ఉద్యోగ ఖాళీలలో సూపర్‌ స్పెషలిస్ట్‌ ఉద్యోగ ఖాళీలు 24, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు 124, జూనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగ ఖాళీలు 36 ఉండగా పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు కావాల్సి ఉంటుంది. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •