టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఎంఎంటీఎస్‌ రైలు పై సీతకన్నేసిన ప్రయాణికులు!!

కరోనా సంక్షోభం తర్వాత ఎంఎంటీఎస్‌ రైళ్లను పునరుద్ధరించి 45 రోజులు దాటినప్పటికీ ప్రయాణికుల ఆదరణ కనిపించడం లేదు. సాధారణ రోజుల్లో 1.6 లక్షల మంది రాకపోకలు సాగించేవారు కానీ ఇప్పుడు మూడొంతుల మంది ఎంఎంటీఎస్‌కు దూరమై రోజుకు 30 వేల మంది కూడా ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకోవడం లేదు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల కంటే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్‌ సర్వీసులపైన పునరుద్ధరణ అనంతరం పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవట్లేదు.

సికింద్రాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి స్టేషన్‌ల మధ్య ప్రస్తుతం 45 నుంచి 50 ఎంఎంటీఎస్‌ సరీ్వసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో సగం వరకు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నట్లు రైల్వే అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •