టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ఆస్పత్రులు..ఎక్కడంటే..??

దేశంలో తొలిసారిగా హైదరాబాద్ సిటీలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులకు రక్షణ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ యాక్ట్ – 2019 అమలులో భాగంగా తొలుత దేశవ్యాప్తంగా పలు మెట్రో సిటీల్లో పత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రెండుట్రాన్స్ క్లినిక్‌లను హైదరాబాద్ సిటీకి కేటాయించింది.

ఒకటి నారాయణగూడలో ఈ ఏడాది జనవరి 29న, రెండోది జీడిమెట్లలో జులై 11న ప్రారంభమయ్యాయి. జీడిమెట్లలోని క్లినిక్‌ను ఫేమస్ డ్రాగ్ ఆర్టిస్ట్ సుశాంత్ దివ్‌గికర్ ప్రారంభించారు. ఈ క్లినిక్‌లలో సేవలందించే వారు కూడా ట్రాన్స్‌జెండర్లే కావడం విశేషం!

ఈ ట్రాన్స్ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా మందికి వీటి గురించి అవగాహన లేకపోవడంతో జీడిమెట్ల క్లినిక్‌ను ప్రారంభించిన సుశాంత్ దివ్‌గికర్ స్పందించి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అవగాహన కల్పిస్తూ జులై 28న పోస్ట్ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •