ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఏసీ నుండి గాలి చల్లగా రావాలంటే??

మీ ఎయిర్ కండిషన్ నుండి గాలి చల్లగా రావట్లేదా?? అయితే ఏసీ నుండి వచ్చే గాలి చల్లగా రావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవి పాటించడం ద్వారా మీ ఏసీ నుండి వచ్చే గాలి ఎప్పుడు చల్లగా ఉంటుంది.

ఏసీ డ్రైన్ పైపులని క్లీన్ చేయాలి: ఏసీలో ఉండే డ్రైన్ పైపులుని కూడా తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. డ్రైన్ పైపులు శుభ్రంగా లేకపోతే ఏసీలో నుంచి స్వచ్ఛమైన గాలి ఉండదు. అలాగే అధికంగా చల్లదనం కోసం ఏసీ చాలా తక్కువ లో పెట్టడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

ఎప్పుడూ ఫిల్టర్లని క్లీన్ చేయండి: ఎప్పటికప్పుడు మీ ఎయిర్ కండిషనర్ లో ఉండే ఫిల్టర్లను శుభ్రంగా ఉంచుకోండి. ఎయిర్ కండిషనర్ ఫిల్టర్ లోపలి నుంచి బయటకు వచ్చే దుమ్ము కణాలు మరియు గ్రీసు లాంటి వాటిని చూసి స్వచ్ఛమైన గాలి అందేలా చేస్తాయి. కనుక ఎయిర్ ఫిల్టర్స్ ని శుభ్రంగా ఉంచండి లేదు అంటే స్వచ్ఛమైన గాలి లభించదు. అలానే మీ రూమ్ ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

కాయిల్స్ క్లీన్ చెయ్యాలి: అలాగే ఎయిర్ కండిషనర్ కాయిల్స్ లో ఒకవేళ దుమ్ము, ధూళి చేరితే చల్లదనం అందదు. కాబట్టి కాయిల్స్ ని కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ కనుక కాయిల్స్ ని శుభ్రం చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఆటోమేటిక్ కాయిల్ క్లీనింగ్ టెక్నాలజీ కలిగిన ఎయిర్ కండిషనర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ఏసీలని తీసుకోవడం వల్ల దుమ్ము, ధూళి సమస్యలు ఉండవు.

ఔట్ డోర్ కండెన్సర్ కాయిన్స్ ని శుభ్రం చెయ్యాలి: అవుట్ డోర్ కండెన్సర్ కాయిల్స్ మనకి బయటకు చూసేందుకు కూడా కనిపిస్తాయి. వీటిని కూడా శుభ్రం చేయకపోతే స్వచ్ఛమైన గాలి లభించదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •