ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహరం చేసుకోవాలి??

కరోనా కారణంగా ఉత్పన్నమైన సమస్యలలో ముఖ్యంగా చెప్పుకోదగినది బరువు పెరగడం! ఈ నేపథ్యంలో బరువు తగ్గాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇదే సమయంలో బరువు తగ్గాలన్న ఆలోచనతో బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక పూట ఆహారం తగ్గిస్తే ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారని ఆశపడతారు కానీ అందరికి ఈ చిట్కా పని చేయదు. ఒక్కొక్కరికీ శరీర క్రియ ఒక్కోలా జరుగుతుంది. కాబట్టి, మీకు సరిపోయే ప్రక్రియను మీరు ఎంచుకుని పాటించాలి లేదంటే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నిపుణులు చెప్పే మాట ఏంటంటే.. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల తలనొప్పి, అలసటగా అనిపించడం జరుగుతుంది. బరువు తగ్గాలనుకునే సమయంలో ఇలాంటి అనవసర ఇబ్బందులని తలెక్కించుకోకుండా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటూనే అందులో ఆహారాలను మార్చడం ద్వారా బరువు తగ్గవచ్చు.

గుడ్లు
గుడ్డులో 6గ్రాముల ప్రోటీన్, 70కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే అధిక ప్రోటీన్ కారణంగా శరీరానికి మంచి ఆరోగ్యం అందుతుంది.

నట్ బట్టర్
బాదం, వేరుశనగ, వాల్ నట్స్ మొదలగు వాటితో చేసిన బట్టర్ లో మంచి కొవ్వు ఉంటుంది. అది శరీరానికి మేలు కలిగిస్తుంది. ఇంకా, అందులో ఉండే ప్రోటీన్ కారణంగా బరువు తగ్గడంతో పాటు ఇతర వ్యాధుల నుండీ ఉపశమనం కలుగుతుంది.

చియా విత్తనాలు
గింజల్లో అన్నింటికంటే అత్యుత్తమమైనవి చియా విత్తనాలే అని చెప్పాలి. అధిక ఫైబర్, కాల్షియం ఉండడంతో శరీరానికి మేళు చేస్తాయి.

తీపి లేని పెరుగు
ప్రోబయోటిక్స్, అధిక కాల్షియం గల పెరుగుని బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే పోషక విలువలు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

అరటి పండు
పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రేగుల్లో కదలికను ఏర్పర్చి మెదడు మంచి సంకేతాలను పంపిస్తుంది. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. బ్రేక్ ఫాస్ట్ లో అరటి పండుని చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉండడమే కాదు బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •