ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

జామపండు ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు??

సామాన్యుడి ఆపిల్ గా జామ పండు ను వర్ణిస్తారు ఎందుకంటే జామ పండు అందరికీ అందుబాటులో తక్కువ ధరలో దొరుకుతుంది. ఖరీదు అయితే తక్కువే కానీ దానిలో ఉండే పోషకాలకు మాత్రం విలువ కట్టలేమని అంటారు వైద్యులు! తినటానికి రుచికరంగా ఉండే జామపండులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఈ పండు ఎంతగానో మేలు చేస్తుందని, జామకాయతోపాటు, జామ చెట్టు ఆకులు, బెరడు లో సైతం అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కొందరు ఔషద నిపుణులు సూచిస్తుండడంతో జామ ఆకులు, బెరడును ఇటీవలికాలంలో కషాయంగా కాచుకుని చాలా మంది తాగుతున్నారు. ఇక జామకాయ విషయానికి వస్తే అందులో అధిక మొత్తంలో యాంటీ అక్సిడెంట్లు, విటమిన్స్, పోటాషియం లభిస్తాయి. ఫైబర్ సైతం అధిక మొత్తంలో లభ్యమౌతుంది.

ముఖ్యంగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి సమయంలో దీనిని తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో జామపండు తినటం వల్ల కడుపు ఉబ్బరంతో నిద్ర సరిగా పట్టని పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు జామకాయను ఎంత మితంగా తింటే అంత మంచిది. 100 గ్రాముల జామలో తొమ్మిది గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. మలబద్దక సమస్యకు చక్కని పరిష్కారంగా ఎంతగానో ఉపయోగపడుతుంది.

జామ కాయను ప్రతిరోజు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలను దూరంగా పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వారు జామ పండును తినకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే జామ పండులో ఉండే విటమిన్ సి ప్రక్టోస్ లు ఎక్కవగా ఉండటం వల్ల కడులో ఉబ్బరంగా ఉండే భావన కలుగుతుంది. అందుకే గ్యాస్ తో బాధడేవారు ఈ పండును దూరంగా పెట్టటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •