వార్తలు (News)

భారత్ లో 43,263 కొత్త కేసులు.. 338 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18.17లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 43,263 మందికి పాజిటివ్‌గా నిర్ధారణకావడంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.31కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజే 338 మంది కరొనతో మరణించగా దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,41,749 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 40,567 మంది వైరస్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.23కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,93,614 మంది వైరస్‌తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 1.19శాతంగా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •