ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఔషదాల ఉలవచారు.. మూత్రంలో రాళ్లు పరార్!!

మన ముందు తరాలవారు ఆహారం లో ఆరోగ్యానికి పెద్ద పీట వేసి మనం తినే ఆహారం లోనే అన్ని రకాల ఔషధాలు ఉండేలా జాగ్రత్తపడేవారు. కానీ తరాలు మారే కొద్దీ మనం జంక్ ఫుడ్ కు అలవాటు పడి మన పెద్దలు చెప్పిన అన్ని జాగ్రత్తలు గాలికి వదిలేసాము.

ఈ తరంలో ఉలవచారు గురించి తెలిసింది ఎంతమందికి? దానిని ఎంతమంది రుచి చూసి ఉంటారు? దానిలోని ఔషధ గుణాల గురించి తెలిసింది ఎందరికి?? అంటే సమాధానం చెప్పడం కష్టం!

అన్నిరకాల వాత వ్యాధులున్నవారు ఉలవచారు తినడం వల్ల వాతం నుండి తప్పించుకోవచ్చు. షుగర్ రోగులు కూడా ఈ ఉలవచారు సేవించవచ్చు. మూత్రపిండాలలో రాళ్లున్నవారు ఈ ఉలవచారుని రోజు తాగితే రాళ్ళు త్వరగా కరిగేందుకు తోడ్పడతాయి. ముల్లంగి అకుగాని,దుంపగానీ దంచి ఆ రసాన్ని ఉలవచారుతో కలిపి తీస్కుంటే రాళ్ళు ఇంకా త్వరగా కరిగిపోతాయి. ఉబ్బసం, క్షయ, కడుపులోనోప్పి, ప్లేగు వ్యాధులతో భాదపడేవారు ఉలవచారుని తరుచు తీస్కుంటే మంచిది. ఉలవలు, బియ్యం కలిపి పుల్లగంలా వండి ఆ పులగాన్ని రోజు తిన్నట్లైతే పైన చెప్పిన అన్ని వ్యాధులు నయమయిపోతాయి. పులగం వండేటప్పుడు వార్చిన గంజిని తాగిన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి మీరు కూడా తాగుతారు కదూ!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •