అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

సొరంగంలో విమానయానం.. గిన్నిస్‌ రికార్డు సొంతమైన వైనం !!

గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశపడుతూ దానిని సాధించడానికి ఎంత సాహసాన్ని అయినా చేయడానికి వెనుకడుగు వేయరు. కొన్ని సందర్భాల్లో ఇందుకోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. టర్కీకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి అరుదైన ఫీట్‌ను చేసి గిన్నిస్‌ రికార్డులో స్థానం దక్కించుకోవడంతో పాటు అందరి ప్రశసంలు పొందారు.

టర్కీకి చెందిన డారియో కోస్టాకు విమానంతో విన్యాసాలు చేయడం అలవాటు. తన హాబీ ద్వారానే గిన్నిస్‌ స్థానంలో సంపాదించుకోవాలనుకున్న డారియో ఇందుకోసం ఓ పెద్ద సాహసానికి తెర తీసి ఇస్తాంబుల్‌లో ఉన్న 2.6 కిలోమీటర్ల పొడవున్న రెండు సొరంగాల్లో విమానం నడిపి రికార్డును సొంతం చేసుకున్నాడు. డారియో విమానాన్ని సొరంగంలో కూడా భూమిపై నుంచి కొంత ఎత్తులో నడిపించారు. విమానం ఏమాత్రం పక్కకు జరిగినా పైకి లేచినా పెద్ద ప్రమాదం జరిగేది. ఇలా 2.6 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో ఆ విమానం ఏకంగా గంటకు 245 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం మరో విశేషం. అత్యంత పొడవైన టన్నెల్ గుండా విమానాన్ని నడపడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఇలా ఇంత వేగంతో అద్భుత ఫీట్‌ను సాధించారు కాబట్టే డారియో గిన్నిస్‌ రికార్డులో స్థానం దక్కించుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •