జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టీ20 వరల్డ్ కప్ జట్టు పై కీలక ప్రకటన!!

యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 ప్రారంభం కానున్న విషయం పాఠకులకు విదితమే! ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్నా కూడా భారత్ లో కరోనా కారణంగా యూఏఈ నిర్వహిస్తుంది. ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించింది.

ఇక భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అయితే ఈ జట్టులో అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లనే కాకుండా మరి కొంతమంది ఆటగాళ్లు రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలతో పాటుగా అశ్విన్ ను కూడా ఎంపిక చేసింది.

భారత జట్టును గమనిస్తే సెలక్టర్లు స్పిన్ కు పెద్దపీట వేసినట్లు అర్ధం అవుతుంది. ఎందుకంటే యూఏఈ లో ఉన్న పిచ్ లు ఎక్కువ స్పిన్నర్ లకే అనుకూలిస్తాయి. ఆ కారణంగానే అశ్విన్ జట్టులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ జట్టులో ఉంటాం అనుకున్న ధావన్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, పృథ్వీ షా లకు షాక్ తగిలింది అనే చెప్పాలి.

ఈ ప్రపంచ కప్ జట్టుకు భారత మాజీ సారథి, మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని మెంటర్ గా వ్యవరించనున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

భారత జట్టులో ఆటగాళ్లు : విరాట్ కోహ్లీ (C), రోహిత్ శర్మ (VC), బుమ్రా , రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, సూర్య కుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, షమీ!

స్టాండ్‌బై ప్లేయర్స్ : శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •