టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

యమహా నుంచి రెండు హైబ్రిడ్ స్కూటర్లు లాంఛ్!!

జపాన్ ​కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటార్స్​ భారత మార్కెట్​ లోకి ఒకేసారి రెండు హైబ్రిడ్​ స్కూటర్లను లాంఛ్ చేసింది.

యమహా రేజెడ్ఆర్ 125 ఫై , స్ట్రీట్ ర్యాలీ 125 ఫై పేర్లతో రెండు స్కూటర్లను మొత్తం ఏడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హైబ్రిడ్ వేరియంట్లను రూ. 76,830 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విడుదల చేసింది. వీటిలో ఒకే రకమైన ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ (Fi), 125 సీసీ బ్లూ కోర్ ఇంజిన్​ను అందించింది. ఈ ఇంజిన్​ 6,500 rpm వద్ద 8.2 సీఎస్​ టార్క్​ను, 5,000 rpm వద్ద 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా రెండు కొత్త స్కూటర్లలోనూ స్మార్ట్​ మోటార్​ జనరేటర్​ సిస్టమ్‌ను చేర్చడంతో పవర్​ అసిస్ట్​ ఫంక్షన్​ రద్దయినా మూడు సెకన్ల తర్వాత ఈ స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్ పనిచేస్తుందని, ఈ స్కూటర్​ను​ కనెక్ట్ ఎక్స్​ యాప్​తో కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఈ యాప్​ ద్వారా వెహికల్​ లొకేషన్​, స్పీడ్​, పెట్రోల్ రీడింగ్ ​ వంటి కీలక సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యమహా స్కూటర్ల​లో క్వైట్ ఇంజిన్ స్టార్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టాప్ & స్టార్ట్ సిస్టమ్, ఎల్​ఈడీ లైటింగ్, యూనిఫైడ్ బ్రేక్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను చేర్చింది.

యమహా “ది కాల్ ఆఫ్ ది బ్లూ” క్యాంపెయిన్​లో భాగంగా ఈ కొత్త స్కూటర్లను లాంఛ్ చేసింది. భారత్​లో వీటి లాంచింగ్​పై యమహా మోటార్ ఇండియా గ్రూప్ కంపెనీల ఛైర్మన్ మోటోఫుమి షితారా మాట్లాడుతూ.. ”కొత్త రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ, స్ట్రీట్ ర్యాలీ 125 FI హైబ్రిడ్ వెర్షన్ల లాంచింగ్​ భారతదేశంలో మా హైబ్రిడ్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. గతంలో యమహా నుంచి విడుదలైన ఫాసినో 125 ఫై హైబ్రిడ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మళ్లీ, ఈ కొత్త వేరియంట్ల ద్వారా మార్కెట్‌లో మా స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలమని విశ్వసిస్తున్నాము.”అని అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •