టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

టిసిఎస్ లో ఆఫ్ క్యాంపస్ హైరింగ్.. ఎప్పుడంటే..??

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్స్ కోసం భారీగా నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. రానున్న అక్టోబర్ మాసంలో Off-Campus హైరింగ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు, అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్ లో సెప్టెంబర్ 24లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు ఈ నియామకాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా 2020, 2021లో పాసై ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలంటే..
ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు నేరుగా లాగిన్ కావొచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు మొదటగా TCS Next Step పోర్టల్ ను ఓపెన్ చేసి ‘Register Now’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అనంతరం IT ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ పూర్తి పేరు, ఈ మెయిల్, కాలేజీ, పాసైన సంవత్సరం, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ తదితర వివరాలను నమోదు చేయాలి. అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లాగిన్ పై క్లిక్ చేయాలి. మీ ఈమెయిల్, నమోదు చేసుకున్న పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. అనంతరం పర్సనల్ డిటైల్స్, Academic and work experience details, Other Details తదితర వివరాలను నమోదు చేసి ‘Apply For Drive’ పై క్లిక్ చేయాలి. మోడ్ ఆఫ్ టెస్ట్ సెలక్ట్ చేయాలి. తర్వాత అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Help Desk: అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే ilp.support@tcs.com మెయిల్ ను లేదా Toll-Free Helpline No: 18002093111 ను సంప్రదించవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •