ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

రెండు డోసులు ఒక కంపెనీవే వేసుకోండి!!

కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలనే సంగతి మనకు తెలిసిందే! అయితే ఏ వాక్సిన్ వేయించుకోవాలి అనే మీమాంశ అందరిలో అలాగే ఉండిపోతుంది. కొంతమంది కోవాగ్జిన్ వేయించుకోవాలా అనుకుంటుంటే… మరి కొంత మంది కోవాగ్జిన్ వేయించుకోవాలా అంటున్నారు.. ఇంకొంతమంది ఐతే ఈరెండు వేయించుకోవాలా? రెండు డోసులు వేరే వేరు వ్యాక్సిన్లు వేయించుకోవాలా? రెండు వేయించుకున్నాక బూస్టర్ కూడా వేయించుకోవాలా? లాంటి అనుమానాలతో సతమతమవుతున్నారు. వీటన్నింటికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క్లారిటీ ఇస్తూ రెండు డోసులు వేయించుకన్నవారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది.

మొదటి డోసు ఏ కంపెనీ టీకా వేసుకుంటారో రెండో డోసు కూడా అదే వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.వ్యాక్సిన్ల విషయంలో వస్తున్న పలు అనుమానాలను నివృత్తి చేస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. కోవిన్‌ యాప్‌తో అందరికీ ఒకే వ్యాక్సిన్‌ అందేలా ఏర్పాటు చేసామని వెల్లడించింది. మొదటి డోసు ఏ టీకా వేశారో రెండో డోస్‌ కూడా అదే వేసేలా నిర్వాహకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని ఈ నివేదికల్లో వెల్లడించింది.

కానీ రెండు డోసుల టీకాలు ఎంతకాలం కరోనా నుంచి రక్షణనిస్తాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదని, భవిష్యత్తులో రెండో డోసు తర్వాత బూస్టర్‌ డోసు అవసరంపై ఇంకా నిర్ణయించలేదని,రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్క్‌ ధరించాలనీ, భౌతికదూరం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్నవారికి యాంటీబాడీస్‌ ఎంతకాలం ఉంటాయో నిర్ధారణ కాలేదు కాబట్టి కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టంచేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •