వార్తలు (News)

ఫెర్రీని ఢీకొట్టి పక్కకి ఒరిగిన పడవ!!

అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్‌ జిల్లాలో నిన్న ఘోర ప్రమాదం సంభవించిన విషయం పాఠకులకు తెలిసిందే! బ్రహ్మపుత్ర నదిలో బుధవారం 120 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తోన్న భారీ పడవ ఒకటి నిమతీఘాట్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న ఫెర్రీని ఢీకొంది. ఫెర్రీని ఢీకొట్టగానే పడవ ఓవైపుకు ఒరగడంతో అందులోని ప్రయాణికులు భయంతో డెక్‌పై పరుగులు పెట్టారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నీటిలోకి దూకేశారు. చూస్తుండగానే పడవ పూర్తిగా తిరగబడింది. మునిగిపోయిన తర్వాత పడవ 1.5 కిలోమీటర్లు కొట్టుకుపోయి ఇసుక దిబ్బలో తలకిందులుగా కూరుకుపోయింది. ఒక్కసారి దానిని పూర్వపు స్థితికి తీసుకొస్తే పడవ కింద ఎవరైనా చిక్కుకుని మరణించారా అన్న సంగతి తెలుస్తుంది అని జోర్హాట్‌ డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌ బర్మాన్‌ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •