అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

విమానం మిస్ కావడంతో అధికారులకు చమటలు పట్టించిన మహిళ!!

చికాగోకు చెందిన ఒక మహిళ తాను ఎక్కాల్సిన విమానం మిస్ చేసుకోవడంతో ఎలా అయినా ఆ విమానం ఎక్కాలని నిర్ణయించుకుని వెనుకముందు ఆలోచించకుండా తాను మిస్ చేసుకున్న ఆ విమానంలో బాంబు ఉందని అధికారులతో అబద్ధం చెప్పింది. దాంతో అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని అధికారులు ఆపేసి తనిఖీ చేయగా అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అనంతరం ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది.

అమెరికాలోని చికాగోకు చెందిన మెరీనా వెర్బిట్స్కీ(46) అనే మహిళ సోమవారం రాత్రి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉండగా ఆమె ఎయిర్‌పోర్టుకు చేరుకునే సరికి ఆలస్యమై అప్పటికే విమానం టేకాఫ్‌కు రెడీగా ఉంది. ఇక తనకు విమానం ఎక్కేందుకు అధికారులు అనుమతించరని భావించిన మెరీనా ఒక కన్నింగ్ ప్లాన్ వేసి ఆ విమానంలో బాంబు ఉందని, తనకు పక్కా సమాచారం ఉందని అధికారులతో అబద్ధం చెప్పింది.

ఆమె మాటలతో హాడలెత్తిపోయిన అధికారులు వెంటనే టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఆ విమానాన్ని నిలిపేశారు. ప్రయాణికులను కిందకు దించి విమానం మొత్తాన్ని బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. కానీ, ఆ సోదాల్లో ఎక్కడ వారికి విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దాంతో మెరీనాను అదపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. తాను విమానం మిస్ కావడంతో ఇలా అబద్ధం చెప్పినట్లు తెలుపడంతో విస్తుపోయిన ఎయిర్‌పోర్టు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •