వార్తలు (News)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు!

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇలాంటి సమయంలో నగరాన్ని మరో భారీ వర్ష సూచన కలవరపెడుతోంది. భాగ్యనగరంలో ఈ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, సహాయం కోసం కంట్రోల్‌ రూంను సంప్రదించవచ్చని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. కంట్రోల్‌ రూం నెంబర్‌ 040 2111 1111ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •