వార్తలు (News)

జంట నగరాల జంట జలశయాలకు భారీ వరద!!

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలశయాలు పొంగి పొర్లుతున్నాయి. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాల్లోకి వరద ప్రవాహం హిమాయత్‌సాగర్‌లో పూర్తిస్థాయి నిల్వసామర్థ్యం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 1763.45 అడుగులకు చేరింది. ఎగువ నుంచి హిమాయత్‌సాగర్‌కు 5వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్‌ సాగర్‌ 8 గేట్లను ఎత్తి 5600 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువన ఉన్న మూసీలోకి విడిచిపెట్టారు.

ఉస్మాన్‌సాగర్‌ నిల్వ సామర్థ్యం 1790 అడుగులు కాగా పూర్తిగా గరిష్ఠస్థాయికి నీరు చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్‌ సాగర్‌లోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఉస్మాన్‌ సాగర్‌ నాలుగు గేట్ల ద్వారా 2250 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ఉన్న మూసీలోకి వదులుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    9
    Shares
  • 9
  •  
  •  
  •  
  •