వార్తలు (News)

ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబర్ 10న అల్పపీడనం!

ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 10న అల్పపీడనం ఏర్పడనుందని, తర్వాత నాలుగైదు రోజుల్లో అది మరింత బలపడి దక్షిణ ఒడిసా ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

మరోవైపు తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపారు.

ఈ ఉపరితల ఆవర్తం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ సహా, తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •