దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,89,983 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 9,419 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజులో 159 మంది మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.74 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో 8,251 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీలు 3.40 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 94,742 క్రియాశీల కేసులున్నాయి.