భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనలో హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం నేడు గుర్తించింది. ప్రమాద స్థలానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్‌ బేస్‌ క్యాంప్‌కు తరలించి, అక్కడి నుండి ఢిల్లీకి తరలించి, అందులో ఉన్న డేటాను డీకోడ్‌ చేయనున్నారు.

బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం దానిలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఈ హెలికాప్టర్‌ ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉన్నది. అలాగే ప్రమాదానికి ముందు పైలెట్లు జరిపిన సంభాషణ సైతం రికార్డయ్యే అవకాశాలుంటాయి. హెలికాప్టర్‌ ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌ బాక్స్‌ కీలక ఆధారం కానున్నది.