తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉపయోగపడేలా విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే సర్కారు బడుల్లో చదివే వారికి రెండు జతల యూనిఫామ్ అందిస్తున్నారు. అంతేకాకుండా పుస్తకాలు కూడా అందజేస్తోంది. అయితే, చాలా మంది విద్యార్థులు పుస్తకాలను కవర్లు, చేతిలో పట్టుకుని బడికి రావడాన్ని గమనించారు.

ఈ నేపథ్యంలో ప్రతీ విద్యార్థికీ పుస్తకాలతో పాటు బ్యాగు కూడా ఇవ్వాలని విద్యాశాఖ ఆలోచిస్తున్న నేపథ్యంలో మొత్తం 22 లక్షల మందికి బ్యాగులు ఇవ్వాలంటే 40 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి సబితకు అధికారులు తెలియజేయడంతో నిధుల సేకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సమగ్ర శిక్షాభియాన్ కింద వీటికి నిధులు పొందడానికి గల అవకాశాలపై సమావేశంలో అధికారులతో మంత్రి చర్చించినట్టు సమాచారం.