నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు తీవ్ర ఊగిసలాటల మధ్య కదలాడుతున్నాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టినా.. కాసేపటికే లాభాలను కోల్పోయి నష్టాల బాట పట్టాయి. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 31 పాయింట్ల నష్టంతో 58,618 వద్ద ట్రేడవుతుండగా , నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 17,459 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.