నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఉదయం 58,831 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 58,340 పాయింట్లకు పడిపోయి తర్వాత కాస్త కోలుకున్న సూచీ చివరకు 157 పాయింట్ల లాభంతో 58,807 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్ల స్వల్ప లాభంతో 17,517 వద్ద ముగిసింది. నేటి మార్కెట్ సూచీలు రోజంతా ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, యూపీఎల్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ముగిసాయి. నెస్లే ఇండియా, టైటాన్‌ కంపెనీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టపోయాయి.