తాజాగా 500రూ. నోటు మీద ఒక ప్రచారం వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (సెక్యురిటీ థ్రెడ్) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే గనుక ఆ నోటు ఫేక్‌ అని, చెల్లదు అని!. ఈమేరకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటూ కనిపిస్తున్న ఒక వీడియో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో వైరల్‌ అవుతోంది దీంతో 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు భయపడుతున్నారు. ఒకవేళ తీసుకున్నా.. ఒకటికి పదిసార్లు తీక్షణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రచారం సాధారణ జనాల్లోనూ ఆందోళన
రేపుతోంది.

దానిలో నిజానిజాలు ఏంటంటే.. 500 నోట్లపై ఉండే గ్రీన్ స్ట్రిప్.. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా గాంధీ బొమ్మకు దగ్గరిగా ఉంటే ఆ నోటు చెల్లదు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, RBI సైతం ఎలాంటి అలర్ట్‌ జారీ చేయలేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో స్పష్టంచేసింది. అంతేకాక ఆ రెండు నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పీఐబి తేల్చిచెప్పింది. ఈ మేరకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో వైరల్‌ అవుతున్న వీడియో నకిలీదంటూ ఒక పోస్ట్‌ను ట్విటర్‌లో ఉంచింది.