దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 13.52లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహిస్తే 1,79,723 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక రోజు వ్యవధిలో 146 మంది కరోనాతో మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,83,936 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46,569 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 7,23,619 కు చేరుకుంది.

దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తం 4,033 మంది కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,552 మంది ఒమిక్రాన్‌ బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.