ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,280 పరీక్షలు నిర్వహిస్తే 984 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,82,843కి చేరింది. నిన్న కరోనా కారణంగా ఎవరూ మృతి చెందకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం. దీంతో ప్రస్తుతం మరణాల సంఖ్య స్థిరంగా 14,505గా ఉన్నాయి. గత 24 గంటల్లో 152 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,62,732 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,606 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..