వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌పై కరోనా పంజా విసిరింది. రెండు రోజుల వ్యవధిలోనే 17మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కాలేజీ యాజమాన్యం ఆందోళనలో పడింది. కళాశాలలో వివిధ విభాగాల సిబ్బంది, అన్ని కోర్సుల విద్యార్థులతో కలుపుకుని దాదాపు 2వేల మందికి పైగా కళాశాలలో ఉండడంతో అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా కళాశాలలో లక్షణాలు కలిగిన వారందరికి పరీక్షలు నిర్వహిస్తుండటంతో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.