జమ్మూకశ్మీర్ లో LOC ప్రాంతాల్లో భారీగా మంచు దుప్పటి కప్పేసింది. నడుము లోతు మంచు పేరుకుపోయింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి మరోవైపు ఏకధాటిగా కురుస్తున్న మంచు.. ఇలాంటి వాతావరణ పరిస్థితుల మధ్య భారత సైనికులు తమ విధులు నిర్వహిస్తున్నారు. మంచు వర్షంలోనూ భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న విజువల్స్ ను డిఫెన్స్ పీఆర్వో విడుదల చేశారు.

కెరాన్ సెక్టార్ లో భారీగా మంచు పేరుకుపోవడంతో డ్యూటీ చేసేందుకు జవాన్లు అవస్థలు పడుతున్నారు. స్నో స్కూటర్లపై తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు.