నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతుంది. డయబెటిస్ ఉన్నవారిలో కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. నరాల బలహీనత సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. ఆ సమస్యను దూరం చేసుకోవాలంటే రాత్రి సమయంలో 5 బాదం పప్పులను నానబెట్టి 3 స్పూన్ల అవిసె గింజలను చిటపట లాడే వరకు వెగించాలి. వేగిన అవిసె గింజలను మిక్సీ జార్ లో వేసి ఆ తర్వాత అరస్పూన్ శొంఠి పొడి, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, అరస్పూన్ పసుపు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి కలిపి ప్రతి రోజు ఉదయం తాగాలి. ఆ తర్వాత నానబెట్టిన బాదం పప్పులను తొక్క తీసి తినాలి.

ఇలా పది రోజుల పాటు చేస్తే మీకు నరాల బలహీనత సమస్య నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. శొంఠి పొడి, దాల్చిన చెక్క పొడి, పసుపు ఈ మూడు మార్కెట్ లో దొరికే పాకెట్స్ కొనకుండా ఇంటిలో తయారుచేసుకుంటే మంచిది. ఆవిసే గింజలలో ఉండే పోషకాలు నరాల బలహీనత తగ్గించటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.