నేటి దేశీయ మార్కెట్ సూచీలు లాభాలతో ఈ వారాన్ని శుభారంభం చేసాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 361 పాయింట్ల లాభంతో 60,105 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 17,912 వద్ద ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ 50 సూచీలో ఐటీసీ, టీసీఎస్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌,యూపీఎల్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, హిందాల్కో, విప్రో, శ్రీరాం సిమెంట్స్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.