దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు ఉదయం నుండి ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. ఉదయం సెన్సెక్స్‌ 60,070.39 పాయింట్ల వద్ద ప్రారంభమై అక్కడి నుంచి 60,427.36 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసి చివరకు 650.98 పాయింట్ల లాభంతో 60,395.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,913.30 వద్ద సానుకూలంగా ప్రారంభమై 18,017.45 – 17,879.15 మధ్య కదలాడి చివరకు 190.60 పాయింట్లు లాభపడి 18,003.30 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ సూచీలో హీరో మోటో కార్ప్స్, ఎస్ బి ఐ, యూ పి ఎల్, టైటాన్, మారుతీ షేర్లు లాభాల్లో ముగిసాయి. దివీస్ లాబ్స్, నెస్లే ఇండియా, ఆసియన్ పెయింట్స్, విప్రో, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ముగిసాయి.