కోయంబత్తూరులోని అవినాషలింగం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఉమెన్‌(ఏవీఐఎన్‌యూటీవై) టీచింగ్ మరియు నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 93
టీచింగ్‌ స్టాఫ్‌ వివరాలు : ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: ఇంగ్లిష్, హ్యూమన్‌ డెవలప్‌మెంట్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, మ్యూజిక్‌ తదితరాలు. ఈ పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డాక్టోరల్‌ డిగ్రీ,మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత ఉండాలి.

నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ వివరాలు: కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్, ఫైనాన్స్‌ ఆఫీసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, సెక్షన్‌ ఆఫీసర్, ఫిల్మ్‌ ఆపరేటర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పాలిటెక్నిక్‌ yì ప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు 27 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్,అవినాషలింగం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హోమ్‌ సైన్స్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఉమెన్, కోయంబత్తూర్‌-641043 చిరునామకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదిగా 28.01.2022 నిర్ణయించారు.