జనవరి 10 న వైకుంఠ ద్వార ఉచిత దర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఉదయం 9 గంటలకు జారీ చేయనున్నట్లు అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఇక జనవరి 13 నుంచి జనవరి 22 వరకు 50 వేల సర్వ దర్శనం టికెట్లు స్థానికులకు మాత్రమే ఇవ్వనున్నట్లు, టోకెన్లు పొందిన భక్తులను మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రమే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు.