క్రైమ్ (Crime)

హైదరాబాద్ లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీస్ లు

మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైక్ లను టార్గెట్ చేసే ముఠాణి పోలీస్ లు పట్టుకున్నారు.
ఇంటర్ విద్యార్ధులు కొంతమంది కలిసి డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేయాలనుకున్నారు.దానికి సక్రమమైన మార్గం విడిచి డబ్బుల కోసం అడ్డదారులు తొక్కారు. చివరికి పోలీసులకు చిక్కారు.
వివరాల్లోకెళితే..హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు . రెంటల్ బైక్ లను చోరీ చేస్తున్న బైక్ లను నలుగురు యువకులు చోరీ చేస్తున్నారు
నిందితులంతా యాకత్ పురాకు చెందిన ఇంటర్ విద్యార్థులు,వీరి నుంచి 38 కి పైగా బైక్ లు 16 ఫేక్ పత్రాలు, 2 జీపీఎస్ ట్రాకర్లను ,3 సెల్ ఫోన్ లను రికవరీ చేశారు పోలీసులు.
మెట్రో స్టేషన్లలో పార్క్ చేసిన బైకులే టార్గెట్ గా వీరి దొంగతనాలు జరిగేవి.
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ” బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు రిజ్వాన్, యాసిన్,హమ్జా, వజీద్ లను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. మెట్రో స్టేషన్ లో పార్క్ చేసిన బైక్ లను చోరీ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ నుంచి తీసుకుని వెళ్లి జి పి ఎస్ ట్రాక్ ను తొలగించి పరార్ అవుతున్నారు” అని తెలిపారు.దొంగిలించిన వాహనాలను నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్ముతున్నారు. ఇప్పటి వరకు దొంగిలించిన వాటి విలువ రూ. 30 లక్షల విలువ ఉంటుంది అని వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.